కేంద్రం నుంచి ఇప్పటిదాకా నయా పైసా సాయం అందలే: కేటీఆర్

కేంద్రం నుంచి ఇప్పటిదాకా నయా పైసా సాయం అందలే: కేటీఆర్

కేంద్రం నుంచి ఇప్పటిదాకా నయా పైసా సాయం అందలేదన్నారు మంత్రి కేటీఆర్. 2022 వరదల్లో హైదరాబాద్ అతలాకుతం అయితే పైసా సాయం ఇవ్వ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతోందన్నారు. హైదరాబాద్ దేశంలోనే వేగంగా విస్తరిస్తున్న  నగరమన్నారు.  వ్యాక్సిన్  ప్రొడక్షన్ కు నిలయంగా మారిందన్నారు. తెలంగాణకు చేయూతనివ్వాలని కోరామని కేటీఆర్ అన్నారు.

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన కేటీఆర్... కంటోన్మెంట్ లో స్కైవేల నిర్మాణంపై చర్చ జరిగిందన్నారు.  జూబ్లీ బస్టాండ్ నుంచి సిద్దిపేట  రాజీవ్ రహదారిలో స్కైవేలకు 96 ఎకరాల కంటోన్మెంట్ ల్యాండ్ఇవ్వాలని కోరామన్నారు.   ల్యాండ్ ఫర్ ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పారు.  ప్యాట్నీ నుంచి నాగ్ పూర్ హైవే లో 18 కి.మీ స్కైవేకు  56 ఎకరాలు ఇవ్వాలని అడిగామన్నారు. త్వరలో ఉప్పల్   స్కైవాక్ ను  ప్రారంభిస్తామన్నారు.   పఠాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో నిర్మాణానికి సహకరించాలని కేంద్రాన్ని కోరామన్నారు కేటీఆర్.