పనిచేయకుంటే పదవులను ఊడదీస్తాం

పనిచేయకుంటే పదవులను ఊడదీస్తాం

రాజన్న సిరిసిల్ల జిల్లా : సక్కగ పనిచేయకుంటే పదవులను ఊడదీస్తామన్నారు మంత్రి కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన.. వేములవాడ రోడ్ షోలో మాట్లాడారు. 70 గజాల స్థలం ఉంటే డైరెక్ట్ గా ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇస్తామన్నారు. ఇంకా 4 ఏళ్లు TRSదేనని.. మంచి పనులు కావాలంటే కారు గుర్తును గెలిపించాలన్నారు. కుల, మతాలతో రాజకీయం చేస్తున్నారని.. ప్రతిపక్షాలకు బంపర్ మెజారిటీతో సమాధానం చెప్పాలని తెలిపారు కేటీఆర్.

అత్యధిక మెజారిటీ మీరిస్తే.. వేములవాడని ఆదర్శ మున్సిపాలీటీ చేస్తామన్న కేటీఆర్.. ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చిన ఘనత TRSది అన్నారు. నీతి అయోగ్ డబ్బులు రిలీజ్ చేసినప్పటికీ ప్రధాని మోడీ ఇవ్వలేదని.. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలన్నారు. పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని.. మున్సిపాలిటీల్లోని 30 రోజుల ప్రణాళికలతో అభివృద్ధి చెందుతాయన్నారు. 5 ఏళ్లలో సాగునీరు, రైతుల మీద ఫోకస్ పెట్టామని.. ఇప్పుడు పట్టణాలను అభివృద్థి చేస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్.