ఫోన్ ట్యాపింగ్: కాంగ్రెస్ నేతల అసత్య ప్రచారంపై కోర్టుకు వెళ్తా: కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్:  కాంగ్రెస్ నేతల అసత్య ప్రచారంపై  కోర్టుకు వెళ్తా: కేటీఆర్

ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు తెరమీదకు తెచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో మంగళవారం  ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. 

తనపై ఫోన్ ట్యాపింగ్ అంటూ తప్పుడు ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, మంత్రిపై కోర్టుకు వెళ్తానని  కేటీఆర్ చెప్పారు. తనపై అబద్దాలు ప్రచారం చేస్తూ తన పరువుప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీలసులు పంపిస్తానని..అసత్య ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేసిన వారు క్షపణలు చేప్పండి లేకపోతే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చారించారు. వాస్తవాలను ధృవీకరించకుండా ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వార్తా కేంద్రాలకు కూడా లీగల్ నోటీసులు ఇస్తామని కేటీఆర్ తెలిపారు.

కాగా, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, ఇద్దరు ఎస్పీలుతోపాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు పోలీస్ కస్టీలో ఉన్నారు.

Also read : ఫోన్ ట్యాపింగ్: ఎస్ఐబీ కేంద్రంగా ఆపరేషన్ పొలిటికల్ లీడర్స్