కాంగ్రెస్ మళ్లీ 20 ఏండ్ల దాకా అధికారంలోకి రాదు : కేటీఆర్

కాంగ్రెస్ మళ్లీ 20 ఏండ్ల దాకా అధికారంలోకి రాదు : కేటీఆర్
  • రెండున్నరేండ్ల పాలన చూశాక ఎవరూ ఓటు వేయరు: కేటీఆర్​
  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్  పాలన చూసిన తర్వాత ప్రజలు మళ్లీ ఆ పార్టీకి ఓటేయరని బీఆర్ఎస్ ​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్  కనీసం 20 ఏండ్ల దాకా అధికారంలోకి రాదన్నారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్  పార్టీ ప్రజలను మోసం చేసిందని, దీనికితోడు ఆ పార్టీ చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో హైదరాబాద్​ నందినగర్​ నివాసంలో ఆయన సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ​ అవినీతి అడ్డగోలుగా పెరిగిపోయిందని, అన్ని అంశాల్లోనూ కమీషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తున్నదని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో భూములతో పాటు అనేక మైనింగ్  కుంభకోణాల్లో స్వయంగా మంత్రులే ఉన్నారని ఆరోపించారు.