32 మెడికల్ ​కాలేజీలు కాదు.. 32 యూట్యూబ్​ చానెళ్లు పెట్టాల్సింది

32 మెడికల్ ​కాలేజీలు కాదు.. 32 యూట్యూబ్​ చానెళ్లు పెట్టాల్సింది

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి తనకు చాలా మంది రకరకాల ఫీడ్​బ్యాక్, అబ్జర్వేషన్స్​పంపుతున్నారని, అందులో ఒకటి ఆసక్తికరంగా ఉందని, దానిని మీతో పంచుకుంటున్నానని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​ఎక్స్​(ట్విట్టర్​)లో పేర్కొన్నారు. కేసీఆర్​32 ప్రభుత్వ మెడికల్​కాలేజీలు ఏర్పాటు చేయడానికి బదులు, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు 32 యూట్యూబ్​చానెళ్లు పెట్టుకొని ఉంటే ఎక్కువ ప్రయోజనం కలిగేది అనే నెటిజన్​అభిప్రాయంతో తాను కూడా ఏకీభవిస్తున్నానని తెలిపారు.