
హైదరాబాద్ గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ కాబోతుందన్నారు మంత్రి కేటీఆర్. సిటీలో తొలిసారి వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరగడం సంతోషంగా ఉందన్నారు. ఔత్సాహికులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.HICC లో రెండో రోజు వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.