ఆవిర్భావ వేడుకలనుఘనంగా నిర్వహించండి

 ఆవిర్భావ వేడుకలనుఘనంగా నిర్వహించండి
  • పార్టీ నేతలు,కేడర్​కు కేటీఆర్​ సూచన
  • బ్రిటన్, అమెరికాకు పయనం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ భవన్​తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని నేతలు, కేడర్​కు బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సూచించారు. తెలంగాణ భవన్​లో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి జాతీయ పతాకం, పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని మంగళవారం ఓ ప్రకటనలో కేటీఆర్  పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షుల  ఆధ్వర్యంలో సంబరాలు జరపాలని కోరారు.

 కాగా.. బ్రిటన్, అమెరికాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేటీఆర్​ విదేశాలకు వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆయన లండన్​ చేరుకున్నారు. అక్కడ బ్రిడ్జ్​ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న ఇండియా వీక్​ 2025 కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే  జూన్ 1, 2న అమెరికాలో నిర్వహించనున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.