రేపు నాగోల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న కేటీఆర్ 

రేపు నాగోల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న కేటీఆర్ 

హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న నాగోల్ ఫ్లైఓవర్ అప్పుడే ఓపెనింగ్ కు సిద్దమైంది. రూ. 143 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు. 990 మీటర్ల పొడవుతో, 6 లైన్ల ఫ్లైఓవర్ ను SRDP లో భాగంగా జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మొత్తం 47 పనులు తీసుకోగా, ఇప్పటివరకు 31 పూర్తయ్యాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. నిర్మాణంలో ఉన్న నాగోల్ ఫ్లైఓవర్ మిగతా పనులను తొందర్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ ఫ్లైఓవర్ ను రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకు సిగ్నల్ ఫ్రీ రవాణా సదుపాయం కలుగనుంది.