కాంగ్రెస్ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి : కేటీఆర్

కాంగ్రెస్ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి : కేటీఆర్

ఒక పార్టీ నుంచి గెలిచి రాజీనామా చేయకుండానే  ఇంకో పార్టీలో చేరితే ఆటో మెటిక్ గా అనర్హత వేటు పడేలా రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ లో సవరణ చేస్తామని కాంగ్రెస్ మేనిఫేస్టోలో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే..అయితే మాజీ మంత్రి కేటీఆర్ దీనిపై తన ఎక్స్ లో  కౌంటర్ ఇచ్చారు.  దేశంలో   రాజకీయ ఫిరాయింపుల ఆయా రామ్, గాయరామ్ సంస్కృతిని ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీ..తన మనసు మార్చుకున్నట్లుందన్నారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసేలా 10వ షెడ్యూల్‌ను సవరించాలన్న కాంగ్రెస్  గొప్ప ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని ట్వీట్ చేశారు. 

అయితే కాంగ్రెస్ చెప్పేది ఒకటి..చేసేది మరొకటని విమర్శించారు కేటీఆర్.  ఓవైపు  పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే.. మరో వైపు  అనర్హత వేటు వేసేలా చట్ట సవరణ చేస్తామంటుందని విమర్శించారు.  తెలంగాణలో ఇటీవల  ఖైరతాబాద్ నుంచి గెలిచిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు కాంగ్రెస్  ఎంపీ టికెట్‌ ప్రకటించారని.. మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను కూడా పార్టీలో  చేర్చుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను  స్పీకర్ అనర్హులుగా ప్రకటించి.. చెప్పిందే చేస్తాం..అబద్ధాలు చెప్పబోమని కాంగ్రెస్ నిరూపించుకోవాలన్నారు కేటీఆర్.