హరీశ్​రావుతో కేటీఆర్ భేటీ​

హరీశ్​రావుతో కేటీఆర్ భేటీ​

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్..​ ఎమ్మెల్యే హరీశ్​రావు నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం అక్కడకు వెళ్లిన కేటీఆర్​ రెండు గంటల పాటు ఆయనతో సమావేశమయ్యారు. హరీశ్​రావు తండ్రి అనారోగ్యంగా ఉన్నారు. 

ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్  అడిగి తెలుసుకున్నారు. తాజా పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.