కవితను ఎలా అరెస్ట్ చేస్తారు? ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం

కవితను ఎలా అరెస్ట్ చేస్తారు? ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం

కవిత అరెస్ట్ విషయంలో ఆమె ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆమె ఇంటికి వెళ్లిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ లను చాలా సేపటి వరకూ లోనికి అనుమతించలేదు. న్యాయవాదులను కూడా ఇంట్లోకి అనుమతించలేదు. ఇంట్లోకి అనుమతించిన వెంటనే కేటీఆర్  ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కనీసం తమ న్యాయవాదినైనా అనుమతించాలి కదా అని వారించారు. అధికారులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. 12 ఎస్ కాట్ వాహనాలతో కవితను ఎయిర్ పోర్ట్ కు తరలించడానికి ఈడీ అధికారుల ప్రయత్నిస్తున్నారు.