ఫైనల్ షెడ్యూల్ లో కుబేర.. జూన్ 20న రిలీజ్ కి రెడీ..

ఫైనల్ షెడ్యూల్ లో కుబేర.. జూన్ 20న రిలీజ్ కి రెడీ..

ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌‌లో శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం ‘కుబేర’. రష్మిక హీరోయిన్‌‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయింది. సోమవారం నుంచి హైదరాబాద్‌‌లో  ఫైనల్ షెడ్యూల్ జరగనుంది. దీనికోసం ఆదివారం ధనుష్​  హైదరాబాద్ చేరుకున్నాడు. 

తనతో పాటు ఈ షెడ్యూల్‌‌లో ముఖ్య పాత్రధారులంతా జాయిన్ కానున్నారు.  ఇప్పటికే  సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేయడంతోపాటు  విడుదల చేసిన   గ్లింప్స్‌‌, ఫస్ట్ సాంగ్  సినిమాపై అంచనాలను పెంచాయి. ఇందులో ధనుష్ బిచ్చగాడి గెటప్‌‌లో కనిపించనున్నాడు. తను ఎందుకు అలా మారాల్సి వచ్చింది అనేది ఆసక్తికంగా ఉండనుందని మేకర్స్ చెప్పారు. 

ఇక నాగార్జున ఈడీ అధికారి పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  జూన్ 20న తెలుగు, తమిళ,  కన్నడ, మలయాళ, హిందీ  భాషలలో సినిమా  విడుదల కానుంది.