
ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా, తాజాగా కొత్త షెడ్యూల్‌ను ముంబైలో మొదలు పెట్టినట్టు మేకర్స్ తెలియజేశారు. ఇది కీలకమైన లెంగ్తీ షెడ్యూల్ అని చెప్పారు.
ధనుష్, నాగార్జునతో పాటు ఇతర నటీనటులు జాయిన్ అయ్యారు. కొన్ని టాకీ సీన్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరించనున్నారు. ఇందులో నాగార్జున పాత్రపై క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. నాగార్జున పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. రోడ్లపై బికారిగా తిరిగే హీరో కుబేరుడిగా ఎలా మారాడనే దానిపై ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్‌గా నాగ్ నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా జిమ్ సర్భ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ధనుష్ ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.