కూకట్పల్లి/జీడిమెట్ల, వెలుగు: కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో గురువారం ఏసీబీ అధికారులు వేర్వేరుగా ఆకస్మికంగా దాడులు చేశారు. కుత్బుల్లాపూర్సబ్రిజిస్ట్రార్ ఆఫీస్‌కు మధ్యాహ్నం వచ్చిన అధికారులు.. రాత్రి 8 గంటల వరకూ తనిఖీలు చేశారు. అనుమానం ఉన్న డాక్యుమెంట్ల జిరాక్స్‌కాపీలను తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సూరారంలోని కుత్బుల్లాపూర్సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి జరుగుతున్నదని, రిజిస్ట్రేషన్చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులు అందాయన్నారు. దీంతో తాము మెరుపు దాడులు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమయంలో సుమారు 15 మంది డాక్యుమెంట్రైటర్లు కార్యాలయంలో ఉన్నారన్నారు.
ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం రావాలి కానీ డాక్యుమెంట్ రైటర్లు వస్తేనే రిజిస్ట్రేషన్జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. రిపోర్టును ఉన్నతాధికారులు పంపి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యాలయంలో డబ్బులు కోసం తనిఖీ చేశామని ఎక్కడా డబ్బులు దొరకలేదన్నారు.
రిజిస్ట్రేషన్చేసుకునే వారికి ఎలాంటి అంతరాయం కలగకుండా తనిఖీ చేశామని వివరించారు. అలాగే కూకట్పల్లి కార్యాలయానికి లోపలి నుంచి తాళాలు వేసి సబ్‌రిజిస్ట్రార్ కోమటిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డితో సహా కార్యాలయ సిబ్బంది అందరినీ ఏసీబీ అధికారులు విచారించారు. కొన్ని గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి. ఇక్కడ ఆస్తుల రిజిస్ట్రేషన్వ్యవహారాల్లో అవకతవకలకు సంబంధించి ఏమైనా ఆధారాలు లభించాయా లేదా అన్నది అధికారులు బయటకు వెల్లడించలేదు.
