గర్భిణి మర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో నలుగురికి జీవిత ఖైదు

గర్భిణి మర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో నలుగురికి జీవిత ఖైదు

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్​ వద్ద ఆరేండ్ల క్రితం దారుణ హత్యకు గురైన నిండు గర్భిణి పింకీ మర్డర్​కేసులో శుక్రవారం కూకట్​పల్లి కోర్టు నలుగురు నిందితులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి పది వేల చొప్పున జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్​ రాష్ర్టానికి చెందిన బింగి అలియాస్​ పింకీ(38), దినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భార్యాభర్తలు.  

పింకీకి అదే గ్రామానికి చెందిన వికాస్​ కశ్యప్​(32)తో వివాహేతర సంబంధం ఏర్పడింది.  వికాస్​ కశ్యప్​, పింకీ 2017లో  పింకీ తన రెండో కుమారుడు జతిన్​తో కలిసి పింకీ  బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన సొంత గ్రామం వచ్చి సహజీవనం చేశారు.  ఈ సమయంలో వికాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కశ్యప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పింకీ గ్రామానికి చెందిన మమతా ఝా(36) తో వివాహేతర సంబంధం ఏర్పడింది.  మమతా వీరి ఇంటికి సమీపంలోనే తన భర్త అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా(60),  కుమారుడు అమర్​కాంత్​ ఝాలతో నివాసం ఉండేది.  మమతతో ఏర్పడిన అక్రమ సంబంధం నేపథ్యంతో వికాస్​, పింకీల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.  దీంతో మమత తన కుమారుడు అమర్​కాంత్​ తోడుగా వికాస్​ను ఉపాధి నిమిత్తం హైదరాబాద్​కు పంపించింది. కొన్ని రోజుల తర్వాత మమత, ఆమె భర్త అనిల్​నగరానికి వచ్చి, మాదాపూర్​ సిద్ధిక్​నగర్​లో ఇండ్లు అద్దెకు తీసుకొని నివాసం ఉన్నారు.  వికాస్​ జాడ తెలుసుకున్న పింకీ 2018 జనవరిలో హైదరాబాద్​కు వచ్చి వికాస్​తో పాటు గదిలో నివాసం ఉండసాగింది.  అప్పటికే పింకీ 8 నెలల గర్భిణీ. 

పింకీ నగరానికి వచ్చి వీరితో ఉంటుండడంతో మమత, వికాస్​ అక్రమ సంబంధానికి అడ్డుగా మారింది. ఎలాగైనా ఆమెను చంపాలని పథకం వేశారు. 2018 జనవరి27వ తేదీన మమత, వికాస్​, అనిల్​, అమర్​కాంత్​లు పింకీని దారుణంగా హత్య చేసి, ఎలక్ర్టికల్​ కట్టర్​తో  పింకీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి గోనె సంచిలో కుక్కారు.  ఆ తర్వాత గోనె సంచిని బైక్​పై బొటానికల్​ గార్డెన్​ రోడ్డులోకి తీసుకువచ్చి రహదారి పక్కన పడేశారు.  స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ మర్డర్​ కేసులో నలుగురు నిందితులను అదే సంవత్సరం ఫిబ్రవరి 12న అరెస్ట్​ చేశారు.

ఆరేండ్ల తర్వాత శిక్ష...

పింకీ మర్డర్​ కేసు ఆరేండ్లుగా కూకట్​పల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ ఆరేండ్ల కాలంలో నిందితులు 18 సార్లు బెయిల్​ కోసం పిటిషన్లు వేయగా కోర్టు కొట్టేసింది.  ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు, ఎవిడెన్స్​లను గచ్చిబౌలి పోలీసులు కోర్టుకు సమర్పించి, చార్జ్​షీట్​ దాఖలు చేశారు.  దీంతో కూకట్​పల్లి కోర్టు నలుగురు నిందితులకు జీవిత కాలం జైలు శిక్ష, ఒక్కొక్కరికి పది వేల చొప్పున ఫైన్​ విధిస్తూ తీర్పు వెల్లడించింది.