ODI World Cup 2023: అప్పుడు బాబర్, ఇప్పుడు బట్లర్: ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తున్న కుల్దీప్ యాదవ్ స్పిన్

ODI World Cup 2023: అప్పుడు బాబర్, ఇప్పుడు బట్లర్: ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తున్న కుల్దీప్ యాదవ్ స్పిన్

కుల్దీప్ యాదవ్.. ప్రస్తుతం ఈ  చైనా మన్ స్పిన్నర్ వరల్డ్ కప్ లో తన మ్యాజిక్ చూపిస్తున్నాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లకు దడ పుట్టిస్తున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లో ప్రభావం చూపిస్తూ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వికెట్లు తీయడం సహజమే అయినా కుల్దీప్ స్పిన్ మాత్రం ప్రపంచాన్ని విస్తు గొలుపుతుంది. ఊహకందని రీతిలో బంతులు వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టిస్తున్నాడు. తాజాగా నిన్న ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ వేసిన బంతి నభూతో నభవిష్యత్ అనే రీతిలో ఉంది. 

వరల్డ్ కప్ లో భాగంగా లక్నో వేదికగా నిన్న (అక్టోబర్ 29) ఇంగ్లాండ్ పై జరిగిన మ్యాచ్ లో కుల్దీప్ మ్యాజిక్ డెలివరీ అందరి మతి పోగొట్టింది . 230 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లాండ్ జట్టు 100 పరుగుల తేడాతో ఓడింది. 39 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయిన  దశలో కెప్టెన్ బట్లర్ ఇంగ్లాండ్ ను ఆదుకునే ప్రయత్నంలో డిఫెన్స్ కే పరిమితమయ్యాడు. అయితే కుల్దీప్ యాదవ్ మాయ నుంచి తప్పించుకోలేకపోయాడు. 16 వ ఓవర్ మొదటి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆఫ్ సైడ్ నుంచి ఈ బంతి ఏకంగా 7.2 డిగ్రీలు తిరిగింది.

ఈ బంతిని ఎవరైనా అవుట్ కావాల్సిందే అనేట్టుగా కుల్దీప్ తన స్పిన్ మ్యాజిక్ ను చూపించాడు. కొంతమందైతే ఈ బంతిని బాల్ ఆఫ్ ది టోర్నమెంట్ గా భావిస్తున్నారు 2019 వరల్డ్ కప్ లో కూడా పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ను కుల్దీప్ ఇలాగే బోల్తా కొట్టించాడు. లీగ్ మ్యాచ్ లో భాగంగా 24 ఓవర్లో బాబర్ ను క్లీన్ బౌల్డ్ చేసాడు. ఇటీవలే కాలంలో ఎంతో మెరుగవుతున్న కుల్దీప్ యాదవ్ తన ఫామ్ ను కొనసాగిస్తే ఈ వరల్డ్ కప్ లో మరిన్ని అద్భుతమైన డెలివరీలు మనం చూడొచ్చు  వచ్చే అవకాశం కూడా ఉంది.  కాగా.. ఈ టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్ లాడిన కుల్దీప్ 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)