IND vs ENG 2025: గ్రౌండ్‌లో అతి పెద్ద తప్పు చేసిన అంపైర్.. నాటౌట్ అని ఇంగ్లాండ్‌కు సైగలు

IND vs ENG 2025: గ్రౌండ్‌లో అతి పెద్ద తప్పు చేసిన అంపైర్.. నాటౌట్ అని ఇంగ్లాండ్‌కు సైగలు

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో  షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. అంపైర్ మైదానంలో చేసిన సైగలు సంచలనంగా మారుతున్నాయి. శ్రీలంక అంపైర్ కుమార్ ధర్మసేన ఆన్ ఫీల్డ్ లో పెద్ద తప్పు చేసినట్టు ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఇండియా ఇన్నింగ్స్ 13వ ఓవర్ రెండో బంతికి జోష్ టంగ్ పదునైన యార్కర్ ను విసిరాడు. ఆ బంతిని డిఫెండ్ చేసే క్రమంలో సాయి సుదర్శన్ బ్యాలన్స్ కోల్పోయి నేలపై పడిపోయాడు. బంతి ప్యాడ్‌కు తగలడంతో ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. 

ధర్మసేన నాటౌట్ గా ప్రకటించి కరెక్ట్ గానే తన నిర్ణయం సరైనదే అని నిరూపించాడు. అయితే నాటౌట్ అని చెప్పే ప్రయత్నంలో ధర్మసేన ఇంగ్లాండ్ ప్లేయర్లకు నాటౌట్ అని బాల్ ఇన్ సైడ్ ఎడ్జ్ అయ్యిందని చేతి వేళ్ళతో సూచించాడు. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ పోప్   DRS తీసుకోలేదు. ధర్మసేన సైగలా కారణంగా ఇంగ్లాండ్ కు రివ్యూ సేవ్ అయింది. రీప్లేలో బంతి సుదర్శన్ బ్యాట్‌ను తాకినట్లు తేలింది. DRS ప్రోటోకాల్ ప్రకారం, అప్పీళ్ల సమయంలో అంపైర్లు అలాంటి సైగలు కానీ వివరం కాని ఇవ్వకూడదు. కానీ ధర్మసేన సంజ్ఞ ఇంగ్లాండ్ కు కలిసొచ్చింది. 

►ALSO READ | IND vs ENG 2025: లేని పరుగు కోసం రిస్క్ అవసరమా.. చేజేతులా రనౌటైన గిల్

ధర్మసేన కావాలని ఇంగ్లాండ్ కు అనుకూలంగా సైగలు చేశాడా.. లేకపోతే ఆన్ ఫీల్డ్ లో ఆ సమయానికి మర్చిపోయి అలా చేశాడా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (4), జడేజా (2) క్రీజ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ నాలుగు  వికెట్లు తీసి ముందంజలో ఉంది. అంతకముందు ఫామ్ లో ఉన్న రాహుల్ (14) తో పాటు జైశ్వాల్ (2) తొలి సెషన్ లో ఔటయ్యారు.