కురవి వీరన్న ఆలయానికి భారీగా ఆదాయం

కురవి వీరన్న ఆలయానికి భారీగా ఆదాయం
  • వెంట్రుకల టెండర్ 
  • రూ. 40 లక్షలు, కొబ్బరి ముక్కల టెండర్ రూ. 41లక్షలు
  •   వేలంలో దక్కించుకున్న వ్యాపారులు

కురవి, వెలుగు: కురవి భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో  భక్తులు సమర్పించిన తలనీలాలు, కొబ్బరి ముక్కలకు నిర్వహించిన వేలంలో భారీగా ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆలయంలో కొబ్బరి ముక్కలు పోగుచేసుకునేందు నిర్వహించిన వేలం పాటలో కురవికి చెందిన రాగం రవి రూ. 40.51 లక్షలకు దక్కించుకున్నారు. గతంలో 19. 20 లక్షలు పలికింది. 

అదేవిధంగా భక్తులు సమర్పించిన తలనీలాలను కరీంనగర్ కు చెందిన దాసరిసాంబయ్య రూ. 40.50 లక్షలకు దక్కించుకున్నారు. గతంలో రూ. 31.50 లక్షలు పోయింది. స్వామికి వచ్చిన ఒడిబియ్యం పోగుచేసుకునేందు కురవికి చెందిన కల్ల గీత రూ. 80 వేయిలకు దక్కించుకున్నారు. గతంలో కంటే ఈ ఏడాది ఆలయానికి ఆదాయం పెరిగిందని ఈవో తెలిపారు.