భర్త నాలుక కొరికిన భార్య.. ఎందుకో తెలిస్తే షాక్​

భర్త నాలుక కొరికిన భార్య..  ఎందుకో తెలిస్తే షాక్​

ప్రేమగా దగ్గరికి తీసుకున్న ఓ వ్యక్తికి భార్య చేతిలో చేదు అనుభవం ఎదురైంది. భర్త బలవంతంగా ముద్దు పెడుతున్నాడని ఓ భార్య అతని నాలుక కొరికేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.  కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం యల్లమ్మగుట్ట తండాలో జరిగిన ఈ ఘటన తాలుకూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాలో  చంద్రానాయక్, పుష్పావతి దంపతులు నివసిస్తున్నారు. 

భర్త ఓ షాపులో పని చేస్తున్నాడు. వారికి ఇద్దరు సంతానం ఉంది.  రెండేళ్లుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. జులై 20న రాత్రి భర్త బలవంతంగా ముద్దు పెట్టుకోవడంతో భార్య అతని నాలుకను బలంగా కొరికింది. దీంతో చంద్రానాయక్ నాలుక పై భాగంలో తీవ్ర గాయమైంది. అతన్ని గుత్తి ఆసుపత్రికి తరలించారు.

పరస్పర ఆరోపణలు..

తన భార్య కోపంతోనే నాలుక కొరికిందని భర్త ఆరోపించాడు. ఆమెకు గ్రామంలోని మరొకరితో సన్నిహిత సంబంధం ఉందని,  వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. భర్త చంద్రానాయక్ తనపై దాడి చేసి ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టేందుకు వచ్చినందుకే ఆత్మరక్షణ కోసం ఇలా చేసినట్లు భార్య తెలిపారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త వైరల్ గా మారింది.