
హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi). సెప్టెంబర్1న శుక్రవారం థియేటర్లలలో రిలీజైన ఖుషి మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
లేటెస్ట్గా ఈ మూవీ ప్రొడ్యూసర్స్ మైత్రి మేకర్స్ కలెక్షన్స్ అప్డేట్ ఇచ్చారు. ఖుషి మూవీ రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.51 కోట్లు వసూళ్లు చేసిందని తెలిపారు. అలాగే ఈ మూవీ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు కలెక్షన్స్ అమాంతం పెరిగే చాన్సు కనిపిస్తోందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైన్గా వచ్చిన ఈ మూవీలో..ఎమోషన్స్, లవ్, కామెడీ అన్ని జోనర్ ఆడియన్స్ను ఫుల్ ఖుషి చేస్తోంది. ఇక బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా టాక్ తెచ్చుకున్న ఖుషి సినిమా విజయ్ దేవరకొండ, సమంత లకు బూస్ట్ ఇచ్చిందని తెలుస్తుంది. ఈ మూవీ రిలీజైన ఫస్ట్డే వరల్డ్ వైడ్ గా రూ.30.1 కోట్లు(గ్రాస్) కలెక్షన్స్ రాగా..సెకండ్ డే రూ.20 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక ఖుషి త్వరలో రూ.100 కోట్ల మార్క్ను రీచ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.
ఈ మూవీ కేవలం రెండ్రోజుల్లోనే మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరడంతో మేకర్స్ ఖుషి చేసుకుంటున్నారు. అలాగే సమంత నటించిన 17 మూవీస్.. మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరాయి.దీంతో సమంత ట్రాక్ రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ రౌడీ అనే ట్యాగ్ తొలిపోవడం కన్ఫర్మ్ అంటున్నారు సినీ క్రిటిక్స్.దీంతో ఫ్యామిలీ స్టార్గా మారబోతున్నట్టు తెలుస్తుంది.నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ సినిమాలు తీసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కించారు.
#BlockbusterKushi smashes 51 CRORES in 2 days worldwide ❤️
— Mythri Movie Makers (@MythriOfficial) September 3, 2023
Families showering all their love on the BLOCKBUSTER FAMILY ENTERTAINER ❤?#Kushi is setting the ticket windows on fire in international and local circuits ??
- https://t.co/16jRp6UqHu@TheDeverakonda… pic.twitter.com/WrSdHwiGgP