విజయ్ దేవరకొండ ఖుషి టైటిల్ సాంగ్ రిలీజ్

విజయ్ దేవరకొండ  ఖుషి టైటిల్ సాంగ్  రిలీజ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda), సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషీ(Khushi). క్లాసిక్ సినిమాలా దర్శకుడు శివ నిర్వాణ(Shiva nirvana) డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అభిమానులు ఎంతోగాను ఎదురుచూస్తోన్న  టైటిల్ ట్రాక్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది. 

శివ నిర్వాణ ఈ గీతాన్ని రచించగా..హేషమ్ అబ్దుల్ వాహబ్(Hesham abdul wahab) చాలా ఇంటెన్సివ్ గా పాడారు. . ‘ఖుషి.. నువ్వు కనపడితే.. ఖుషి నీ మాట వినబడితే' లిరిక్స్ హృదయాన్ని హత్తుకునేలా సాంగ్ ను కంపోజ్ చేశారు అబ్దుల్ వాహబ్.  హీరోయిన్‍ సమంతతో ప్రేమలో పడిన తర్వాత.. హీరో ఆనందంలో మునిగి తేలుతున్నట్టు.. మెలోడియస్‍గా ఫీల్ ఇస్తుంది సాంగ్. రాజు సుందరం, బృంద మాస్టర్స్  కొరియోగ్రఫీ అందించిన ఈ టైటిల్ సాంగ్ రౌడీ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. 

రీసెంట్ గా రిలీజైన ఆరాధ్య(Aradhya) అంటూ సాగే ఆ పాటకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. యూట్యూబ్ లో ఈ సాంగ్ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది.ఆ జంట మధ్య ఉండే ప్రేమ,అనుబంధాన్ని చాలా అందంగా చూపించారు. అలాగే నా రోజా నువ్వే సాంగ్ సైతం ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ఇప్పటికి రిలీజైన ఖుషి సాంగ్స్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తున్నాయి. 

నిన్ను కోరి, మజిలి, టక్ జగదీష్ సినిమాలు తీసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఖుషి సినిమా థియేటర్లలో 2023 సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.