అమెరికా సైనిక స్థావరాలకు ఆశ్రయం కల్పిస్తున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కువైట్ పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. 2026, మార్చి 26న ఎయిర్ పోర్టుపై దాడి చేసిన మరుసటి రోజే.. కువైట్ ప్రధాన పోర్టుపై డ్రోన్ తో అటాక్ చేసింది. శుక్రవారం (మార్చి 27) కువైట్ వాణిజ్య హార్బర్ అయిన షువైక్ పోర్టుపైన మిస్సైల్ తో అటాక్ చేసింది.
ఈ దాడిలో నౌకాశ్రయంలోని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నట్లు కువైట్ పేర్కొంది. మెయినో పోర్టుపై డ్రోన్ దాడి జరిగినట్లు కువైట్ పోర్ట్స్ అథారిటీ (KPA) ప్రకటించింది. ఈ దాడిలో ఆస్తి నష్టం జరిగిందనీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. హార్బర్ లోని మెటీరియల్ డ్యామేజ్ అయ్యిందని ప్రకటన విడుదల చేసింది.
పోర్టుపై దాడి జరిగిన వెంటనే కువైట్ సెక్యూరిటీ ఫోర్సెర్ యాక్టివేట్ అయ్యాయి. పోర్ట్ ఏరియాలో ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ అమలులోకి వచ్చినట్లు తెలిపారు. హార్బర్ ను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
కువైట్ వాణిజ్యానికి కీలకం షువైక్ పోర్ట్:
షువైక్ పోర్టు కువైట్ వాణిజ్య కార్యకలాపాలకు కీలకమైనది. కువైట్ సిటీకి సమీపంలో ఇండస్ట్రియల్ జిల్లాలో ఉంటుంది. కువైట్ వాణిజ్యం ఎక్కువగా ఈ మెరీటైమ్ హబ్ నుంచే జరుగుతుంది. దేశ వాణిజ్య నౌక, కార్గో కార్యకలాపాలన్నీ ఎక్కువగా ఇక్కడినుంచే జరుగుతాయి.
