కొంపల్లి ఫాంహౌస్ లో రోశయ్య అంత్యక్రియలు

కొంపల్లి ఫాంహౌస్ లో రోశయ్య అంత్యక్రియలు

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. కొంపల్లి ఫాం హౌస్ లో రోశయ్య అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. మధ్యాంహం ఒంటి గంటకు అంత్యక్రియలు ముగుస్తాయన్నారు కేవీపీ. ఆసుపత్రికి తీసుకువచ్చే సరికి రోశయ్య మరణించినట్లు వైద్యులు తెలిపారన్నారు. రేపు గాంధీ భవన్ లో 12 నుంచి 12.30 గంటల వరకు అభిమానులు,కార్యకర్తల సందర్శనార్థం రోశయ్య పార్థీవదేహం ఉంచుతామన్నారు. మరోవైపు బంజారహిల్స్ స్టార్ హాస్పిటల్ నుంచి రోశయ్య నివాసానికి పార్ధివదేహం తరలించారు.

రోశయ్య రాష్ట్ర ప్రజలకు సమర్ధవంతంగా సేవలు అందించారన్నారు కేవీపీ రామచంద్రరావు. ఆర్థిక శాఖ మంత్రిగా రికార్డు బ్రేక్ చేశారన్నారు. రోశయ్య తనకు దీర్ఘకాల సన్నిహితుడన్నారు. ప్రభుత్వ ఆస్తిని తన స్వంత గా జాగ్రత్తగా వ్యవహరించే వారన్నారు. సాదాసీదాగా ఎలా బతకాలనేది రోశయ్య చూసి కొత్తగా ఎన్నికవుతున్న ప్రతినిధులు నేర్చుకోవాలన్నారు కేవీపీ. ఆయన మరణం తీరని లోటన్నారు. కాంగ్రెస్ లో నిబద్ధతతో పనిచేశారన్నారు. వైఎస్ ఆర్.. రోశయ్య నుంచి అనేక విషయాలు నేర్చుకున్నారన్నారు. ఆర్థిక మంత్రిగా క్రమశిక్షణ తో.. ఆస్తుల సంరక్షణ చేశారన్నారు. ఈ సందర్భంగా రోశయ్య  కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. 

మరోవైపు మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినేట్ లో ఆయనతో కలిసి పని చేశారన్నారు. ఆయన రాష్ట్రానికి ఎంతగానో సేవలు అందించారన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. వైఎస్ ఆర్.. రోశయ్య నుంచి అనేక విషయాలు నేర్చుకున్నారన్నారు. తనకు తండ్రిలా ఉండేవారన్నారు. ఆర్థిక మంత్రిగా క్రమశిక్షణ తో.. ఆస్తుల సంరక్షణ చేశారన్నారు. రాత్రి నిద్రలోనే రోశయ్య కాలం చేసినట్లు వైద్యులు తెలిపారన్నారు షబ్బీర్.