అమెరికా దాటి వెళ్లొద్దు..తన ఉద్యోగులకు గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వైజరీ

అమెరికా దాటి వెళ్లొద్దు..తన ఉద్యోగులకు గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వైజరీ

వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీతోపాటు ఇతర వర్క్ వీసాలపై పనిచేస్తున్న తన ఉద్యోగులకు గూగుల్ కంపెనీ కీలక సూచనలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప అంతర్జాతీయ ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరించింది. యూఎస్ ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్ (వీసా రెన్యూవల్ లేదా కొత్త స్టాంప్) అపాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు పొందడానికి 12 నెలల వరకు ఆలస్యం జరుగుతోందని వివరించింది.

 అమెరికా బయటే నెలల తరబడి ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని తెలిపింది. దీనివల్ల ఉద్యోగం కోల్పోతారని హెచ్చరించింది. ప్రెసిడెంట్ ట్రంప్ కొత్తగా అమలు చేసిన సోషల్ మీడియా అకౌంట్స్ స్క్రీనింగ్ సహా ఇతర కఠినమైన వీసా తనిఖీలు.. కొత్త హెచ్-1బీ దరఖాస్తులకు 1 లక్ష డాలర్ల ఫీజు విధించడం వంటి మార్పులే వీసా స్టాంపింగ్ ఆలస్యాలకు కారణమని వివరించింది. అందువల్ల హెచ్-1బీ ఉద్యోగులు ప్రస్తుతం విదేశాలకు వెళ్లకపోవడమే మంచిదని గూగుల్ స్పష్టం చేసింది.