T20 World Cup 2024: వరల్డ్ కప్ నుంచి విండీస్ ఓపెనర్ ఔట్..రీప్లేస్‌మెంట్ ఎవరంటే..?

T20 World Cup 2024: వరల్డ్ కప్ నుంచి విండీస్ ఓపెనర్ ఔట్..రీప్లేస్‌మెంట్ ఎవరంటే..?

టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ తన జోరు కొనసాగిస్తుంది. లీగ్ మ్యాచ్ ల్లో అన్ని గెలిచిన విండీస్ జట్టు సూపర్ 8 లో ఇంగ్లాండ్ తో ఓడిపోయింది. అయితే శనివారం (జూన్ 22) ఉదయం అమెరికాతో జరిగిన మ్యాచ్ లో భారీ విజయంతో మళ్ళీ విజయాల బాట పట్టింది. ఇదిలా ఉంటే వెస్టిండీస్ జట్టుకు ఓపెనర్ బ్రాండన్ కింగ్ సైడ్ స్ట్రెయిన్‌తో టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో వరల్డ్ కప్ లో విండీస్ కు బిగ్ షాక్ తగిలింది.

ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు 86 పరుగులు చేసిన కింగ్.. సూపర్ 8 లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో సైడ్  స్ట్రెయిన్‌తో బాధపడ్డాడు. 13 బంతుల్లో 23 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. కింగ్ గాయపడడం మ్యాచ్ పై తీవ్ర ప్రభావం చూపించింది. స్కానింగ్ రిపోర్ట్స్ ప్రకారం కింగ్ పూర్తి ఫిట్ నెస్ సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది. అతను జట్టుతో కలిసి బార్బడోస్‌కు వెళ్లినప్పటికీ టోర్నమెంట్ ఆడడం కష్టమే.  దీంతో అతని స్థానంలో ఆల్ రౌండర్ కైల్ మేయర్స్ ను ఎంపిక చేశారు. శనివారం (జూన్ 22) అమెరికా మ్యాచ్ కు మేయర్స్ జట్టులో చేరాడు.  

ఆల్ రౌండర్ గా మేయర్స్ కు 37 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. బ్యాటింగ్ లో ఓపెనర్ గా, బౌలింగ్ లో మీడియం పేస్ వేయగలడు. కింగ్ దూరమవడంతో శనివారం అమెరికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో చార్లెస్ కు ఓపెనర్ గా షై హోప్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఓపెనర్ గా వచ్చిన అవకాశాన్ని హోప్ అద్భుతంగా వినియోగించుకున్నాడు. ఈ మ్యాచ్ లో 39 బంతుల్లోనే 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.