వరంగల్ హాస్పిటల్‌‌‌‌ నిర్మాణానికి టెక్నికల్ బిడ్స్

వరంగల్ హాస్పిటల్‌‌‌‌ నిర్మాణానికి టెక్నికల్ బిడ్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టెక్నికల్ బిడ్స్‌‌‌‌ను ఆర్ అండ్ బీ అధికారులు బుధవారం ఓపెన్ చేశారు. ఈ టెండర్‌‌‌‌‌‌‌‌కు సాంకేతికంగా అర్హత సాధించిన ఎల్ అండ్‌‌‌‌ టీ, షాపూర్ జీ పల్లోంజీ కంపెనీలు మాత్రమే టెండర్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫైనాన్సియల్ బిడ్స్‌‌‌‌ను మూడురోజుల్లో ఓపెన్ చేస్తామని ఆర్ అండ్‌‌‌‌ బీ ఉన్నతాధికారి తెలిపారు. 60 ఎకరాల స్ధలంలో 24 అంతస్తుల్లో రూ.1,100 కోట్ల ఖర్చుతో నిర్మించే ఈ హాస్పిటల్‌‌‌‌లో 1,750 బెడ్స్‌‌‌‌ ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణాన్ని18 నెలల్లో  పూర్తిచేయాలని టెండర్ దక్కించుకునే కంపెనీని సర్కారు ఆదేశించనుంది.