
బెంగళూరు: ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారిగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ జట్టు సపోర్టింగ్ స్టాఫ్‌లో ఓ మహిళకు చోటిచ్చింది. తమ జట్టు మసాజ్ థెరపిస్ట్‌గా నవనిత గౌతమ్ అనే మహిళను ఆర్‌సీబీ నియమించుకుంది. దీంతో సపోర్టింగ్ స్టాఫ్‌లో ఓ మహిళ ఉన్న ఏకైక ఫ్రాంచైజీగా ఆర్‌సీబీ ఘనత సాధించింది. జట్టు హెడ్ ఫిజియోథెరపిస్ట్ ఇవాన్ స్పీచ్లీ, కండిషనింగ్ కోచ్ శంకర్ బసుతో కలిసి నవనిత సేవలందించనుంది.