
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పలు సంఘాలు బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ అమలు చేయొద్దంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. పశ్చిమ బెంగాల్‌లో ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. వ్యతిరేక, అనుకూల వర్గాలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో గుంపులో ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరగడంతో ఇద్దరు మరణించారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే మహారాష్ట్రలో CAAకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో నిరసనకారులకు అనూహ్యమైన షాక్ ఎదురైంది.
#WATCH A shopkeeper in Yavatmal uses Red Chilli powder to stop the agitators protesting against CAA, NRC and NPR from shutting her shop today during Bharat Bandh called by multiple organisations. #Maharashtra pic.twitter.com/32aE3JaReU
— ANI (@ANI) January 29, 2020
భారత్ బంద్‌లో భాగంగా షాపులు మూయిస్తున్న నిరసనకారులపై ఓ మహిళ ఎదురు తిరిగింది. తన షాపును మూసేయడానికి మీరెవరంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులను సైతం ఎవరో వచ్చి గొడవ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారేంటంటూ ప్రశ్నించింది. ఆమె భర్తతో కలిసి కారం పొడి తీసుకుని చల్లుతూ నిరసనకారులను తరుముకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్మార్ట్ లేడీ, సూపర్ ఐడియా, మహిళా శక్తి, ఝాన్నీ రాణి లక్ష్మీభాయి వారసురాలు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే నిరసనకారులపై సెటైర్లు వేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మజా వచ్చిందా?, బాగా మండిందా? అంటూ మెమ్స్ పోస్ట్ చేస్తున్నారు.
— Footpath Sleepers Association of Mumbai (@nigam_acharya) January 29, 2020