
మేడిపల్లి, వెలుగు: నాచారం, మల్లాపూర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియాల నుంచి వచ్చిన కెమికల్స్తోబోడుప్పల్లోని రాచెరువులో సుమారు 20 లక్షల చేపలు చనిపోయాయి. కెమికల్ వేస్టేజ్ చెరువులో చేరకుండా చర్యలు తీసుకోవాలని పలుమార్లు పీసీబీ అధికారులకు వినతిపత్రాలను అందజేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.