
క్రైస్ట్‌చర్చ్: ఇండియా మాజీ క్రికెటర్, తెలుగు మహిళ జీఎస్ లక్ష్మికి అరుదైన గౌరవం దక్కింది. విమెన్స్వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగే ఫైనల్లో ఆమె మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనుంది. దాంతో, ఓ వరల్డ్‌కప్ ఫైనల్‌కు రిఫరీగా పని చేసిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టిస్తుంది. డిసెంబర్ 2020లో జరిగిన మెన్స్వరల్డ్ కప్ లీగ్-2 మ్యాచ్‌లోనూ ఆమె రిఫరీగా వ్యవహరించింది. హగ్లే ఓవల్‌లో జరిగే ఫైనల్ కోసం నలుగురు విమెన్ అఫీషియల్స్ పని చేయనున్నారు. క్రికెట్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే తొలిసారి. లౌరెన్ ఎజెన్‌బాగ్ (సౌతాఫ్రికా), కిమ్ కాంటెన్ (న్యూజిలాండ్) ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. జాక్వెలిన్ విలియమ్స్ (వెస్టిండీస్) టీవీ అంపైర్‌గా పని చేయనుంది.