చంద్రబాబుకు సిగ్గు,  అభిమానం, అవమానాలు లేవు: లక్ష్మీ పార్వతి

చంద్రబాబుకు సిగ్గు,  అభిమానం, అవమానాలు లేవు: లక్ష్మీ పార్వతి

 

సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని  నందమూరి లక్ష్మీపార్వతి ధీమా వ్యక్తంచేశారు. . ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి చంద్రబాబుపైనా, ఆయన పాలనపైనా మరోసారి విమర్శలు సంధించారు. సిగ్గు..అభిమానం..అవమానం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ దుయ్యబట్టారు. వ్యక్తి గత విమర్శలు చేయడంలో చంద్రబాబు..లోకేష్ ఒకటేనన్నారు లక్ష్మీపార్వతి. చంద్రబాబు..లోకేష్ లు ఎన్నిసార్లు ఇంట్లో గొడవలు పడ్డారో తనకు  తెలుసన్నారు.  తిరుపతి వచ్చినప్పుడు అమిత్ షా పై రాళ్లు వేసిన చంద్రబాబు ఎలా ఇప్పుడు బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటారు? అంటూ ప్రశ్నించారు.చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మానిఫెస్టోకి ఆర్బీఐ మొత్తం డబ్బు కూడా సరిపోదంటూ ఎద్దేవా చేశారు.

అమిత్ షాతో చంద్రబాబు భేటీ పొత్తుల కోసమేనని..కానీ బీజేపీ టీడీపీ పొత్తు ఉంటుందని తాను అనుకోవడంలేదని లక్ష్మీపార్వతి అన్నారు. ఒకవేళ అదే గనుక నిజంగా జరిగే అవకాశం ఉంటే ఇప్పటికే కొన్ని మీడియాలు  ప్రచారం చేసేవని  సెటైర్లు వేశారు. చంద్రబాబు వాజ్ పాయ్ కాలం నుంచి బీజేపీ నీ మోసం చేస్తున్నారంటూ విమర్శించారు.  చంద్రబాబు ప్రభుత్వ అక్రమాల వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని..నిర్మాణ వ్యయం కూడా చంద్రబాబు పాలన వల్లే పెరిగిందన్నారు.   జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు.