సిడ్నీ: ఇండియా స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో ఏడో సీడ్ లక్ష్య 17–21, 24–22, 21–16తో రెండోసీడ్ చోయు టియెన్ చెన్ (చైనీస్‌తైపీ)పై సంచలన విజయం సాధించాడు. 86 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ తొలి గేమ్ కోల్పోయాడు. రెండో గేమ్‌లోనూ వెనకబడినా చివర్లో మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నాడు.
స్టార్టింగ్ నుంచి డిఫెన్సివ్ షాట్లు ఆడిన లక్ష్య నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం దూకుడును చూపెట్టాడు. కోర్టు మొత్తం కలియదిరుగుతూ బలమైన స్మాష్‌లు కొట్టాడు. దాంతో 6–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత లెంగ్త్‌ను మరింత మెరుగుపర్చుకుని నెట్ వద్ద పదునైన డ్రాప్స్ వేశాడు.
