వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు లక్ష్యసేన్ అర్హత.. రెండోసారి ఛాన్స్ కొట్టేసిన భారత షట్లర్!

వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు లక్ష్యసేన్ అర్హత.. రెండోసారి ఛాన్స్ కొట్టేసిన భారత షట్లర్!

హాంకాంగ్‌‌‌‌: ఇండియా షట్లర్‌‌‌‌ లక్ష్యసేన్‌‌‌‌.. బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ టూర్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌కు అర్హత సాధించాడు. హాంకాంగ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–500 టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో లక్ష్య 14–21, 21–16, 25–23తో అర్నాడ్‌‌‌‌ మెర్కిల్‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌‌‌‌కు చేరాడు. మరో మ్యాచ్‌‌‌‌లో కిడాంబి శ్రీకాంత్‌‌‌‌ 21–16, 16–21, 21–9తో కొకి వతనాబే (జపాన్‌‌‌‌)ను ఓడించడంతో లక్ష్యకు ఫైనల్స్‌‌‌‌ బెర్త్‌‌‌‌ ఖాయమైంది. 

ఫైనల్స్‌‌‌‌ పట్టికలో లక్ష్య 74,180 పాయింట్లతో వతనాబే 73,620 పాయింట్లతో దాదాపుగా సమాన స్థితిలో ఉన్నారు. దాంతో వతనాబే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌లో ఓడాడు. అతని నిష్క్రమణతో కున్లావట్ విటిద్సార్న్‌‌‌‌ (థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌), చౌ టియాన్‌‌‌‌ చెన్‌‌‌‌ (చైనీస్‌‌‌‌తైపీ) కూడా ఫైనల్స్‌‌‌‌కు అర్హత సాధించారు.  వరల్డ్‌‌‌‌ టూర్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌కు లక్ష్య అర్హత సాధించడం ఇది రెండోసారి. పీవీ సింధు తర్వాత ఫైనల్స్‌‌‌‌ చేరిన రెండో ప్లేయర్‌‌‌‌గానూ రికార్డులకెక్కాడు.