ఇన్‌స్టా బ‌యోను మార్చిన లలిత్

ఇన్‌స్టా బ‌యోను మార్చిన లలిత్

నటి సుష్మితా సేన్ తో డేటింగ్‌ చేస్తున్నట్లుగా రెండు నెలల క్రితం ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇది ఇప్పుడిది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయిందన్న టాక్ నెట్టింట జోరుగా నడుస్తోంది. గతంలో లలిత్ మోడీ ఇన్స్టాగ్రామ్ పేజీ బయోలో న్యూ లైఫ్ విత్ సుష్మితా అని ఉండేది.. కానీ ఇప్పుడు దానిని లలిత్ తొలిగించారు. దీనితో సుష్మితా సేన్‌తో లలిత్‌మోడీ బ్రేకప్‌ చెప్పాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు లలిత్ మోడీతో డేటింగ్‌పై  ఇంతవరకు సుష్మితా నోరు విప్పక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lalit Modi (@lalitkmodi)

పన్ను ఎగవేత కేసులో ఇండియాను విడిచిపెట్టిన లలిత్ మోడీ...  2010 నుండి లండన్‌లోనే ఉంటున్నాడు. లలిత్ మోడీ గతంలో మినాల్ సగ్రానీని వివాహం చేసుకున్నాడు. 1991 అక్టోబర్ లో వీరి వివాహం జరిగింది. మినాల్ సగ్రానీ .. లలిత్ మోడీ కంటే పదేళ్లు పెద్ద. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.  2018లో మినాల్ సగ్రానీ క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయింది. ఇక సుష్మితా సేన్ 1994లో విశ్వ సుందరి పోటీలో విజేతగా నిలిచింది. ఆ తరువాత హిందీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించి మరింత ఫేమ్ తెచ్చుకుంది.  46 ఏళ్ళు వచ్చినా  సుష్మితా ఇంకా పెళ్లి చేసుకోలేదు.  అలీసా, రెనీ అనే  ఇద్దరిని దత్తత తీసుకుని జీవితం కొనసాగిస్తుంది.