- ముఖ్యమంత్రికి ఆదివాసి సంఘాల విజ్ఞప్తి
ఖైరతాబాద్,వెలుగు: సుప్రీం కోర్టు తీర్పులో ఎస్సీ వర్గీకరణతోపాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలను గుర్తించాలని మాజీ ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని కోరారు. ఆదివాసీ స్టూడెంట్స్ఫోరం అధ్యక్షుడు బట్టా వెంకటేశ్వర్లు, ఆధార్సొసైటీ అధ్యక్షుడు గొండి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
లంబాడీలు అసలు ఎస్టీలే కాదని, దీనిపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుందన్నారు. అడవి తల్లిపై ఆధారపడి జీవించేవారు ఆదివాసీలన్నారు. ఎస్సీ వర్గీకరణలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఎస్టీల్లోనూ ఏబీసీడీ వర్గీకరణ త్వరగా జరిగేలా ముఖ్యమంత్రి చొవ తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్సందీప్, లక్ష్మీ నారాయణ, గుమ్మడి సుధీర్, శశిప్రియ, రమ లింగయ్య బాబు తదితరులు పాల్గొన్నారు.