హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు షాక్ ఇచ్చారు సీపీ సజ్జనార్. శనివారం (డిసెంబర్ 20) ఒకేసారి 80 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకు ర్యాంక్ అధికారులను అటాచ్ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేశారు.
కొన్నేళ్లుగా టాస్క్‌ఫోర్స్‌లో పాతుకుపోయిన అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. టాస్క్‌ఫోర్స్ విభాగంలో అవినీతిని నిరోధించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఒక నిందితుడిని తప్పించేందుకు భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. టాస్క్‌ఫోర్స్ ప్రక్షాళనకే నిర్ణయం తీసుకున్నారని సీనియర్ అధికారులు అంటున్నారు.
