హైదరాబాద్, వెలుగు: ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ నాలుగో రౌండ్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్లు అఖిల్ అలీబాయ్, నీల్ జాని సత్తా చాటారు. శనివారం కోయంబత్తూర్‌లోని కారి మోటర్ స్పీడ్‌వే ట్రాక్‌లో జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్), ఫార్ములా 4 ఇండియన్ ఓపెన్ తొలి రేసుల్లో టాప్–2 ప్లేసుల్లో నిలిచారు.
ఫార్ములా 4 ఓపెన్ తొలి రేసులో అఖిల్ 26 నిమిషాల 34.669 సెకన్లతో అందరికంటే ముందుగా పోడియం చేరుకొని టాప్ ప్లేస్ కైవసం చేసుకున్నాడు. మరోవైపు ఐఆర్‌ఎల్ తొలి రేసులో నీల్ జాని 26 నిమిషాల 35. 335 సెకన్లతో రేసు ముంగిచి రెండో స్థానంతో రన్నరప్‌గా నిలిచాడు. చెన్నై టర్బో రైడర్స్‌కు చెందిన జాన్ లాంకస్టర్ 26 నిమిషాల 54.251 సెకన్లతో పోడియం ఫినిష్ చేశాడు.