ఈటల కొడుకుపై కేసీఆర్ కు భూకబ్జా ఫిర్యాదు

ఈటల కొడుకుపై కేసీఆర్ కు భూకబ్జా ఫిర్యాదు

మేడ్చల్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో సీఎం కేసీఆర్ కు మరో ఫిర్యాదు అందింది. ఈటల రాజేందర్ కుమారుడు ఈటల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారనీ, తనకు న్యాయం చేయాలని కోరుతూ.. మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. తనకందిన ఫిర్యాదు మేరకు తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏసీబీ విజిలెన్స్ శాఖ, రెవెన్యూ శాఖలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.