బతుకమ్మ చీరలతో ఇళ్ల స్థలాల ఆక్రమణ

బతుకమ్మ చీరలతో ఇళ్ల స్థలాల ఆక్రమణ

జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం పటేల్ గూడెం శివారులో ఒకే రోజు సుమారు ఐదువేల గుడిసెలు వెలిశాయి. సరికొత్త పంథాలో ఇంటిస్థలం కోసం కమ్యూనిస్టు పార్టీల నేతృత్వంలో పేదలు భూ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఇలా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ మేరకు "సర్వే నెంబర్ 464, 465, 466 గల ఈ భూమి ప్రభుత్వానిది.. చొరబాటుదారులు విధిగా శిక్షించబడతారు" అని అధికారులు పెట్టిన బోర్డు స్థంలో పేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారు. 

అధిక సంఖ్యలో అక్కడికి వచ్చిన జనం... బతుకమ్మ చీరలతో గుడిసెల వలె స్థావరాలను ఏర్పరచుకుని ఇళ్ల స్థలాలను ఆక్రమించారు. ఒకేసారి వేలాదిగా వచ్చి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడంతో జిల్లా అధికార యంత్రాంగం అయోమయంలో పడ్డట్టు సమాచారం.