
హైదరాబాద్, వెలుగు: ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎంఆర్‌హెచ్‌ఎల్) ఒకే నెలలో మూడు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఢిల్లీలో సెప్టెంబర్19న జరిగిన ఇటీ నౌ ఇన్‌ఫ్రా ఫోకస్ సమిట్–2025లో పీపీపీ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్ గా ఎల్ అండ్ టీ మెట్రోఎంపికైంది. ఈ అవార్డును ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ సీఈఓ కేవీబీ రెడ్డి అందుకున్నారు.
అలాగే ఎక్సలెన్స్ ఇన్ ఫ్యూయల్ మెయింటెనెన్స్ లో ఇండియాలోనే మొదటి మెట్రోగా సీఐఐ 26వ జాతీయ అవార్డును గెలుచుకుంది. అలాగే, రింగ్ మెయిన్ పవర్ సప్లై సిస్టమ్ విత్ ఇంటెలిజెంట్ జీఐఎస్ ప్యానల్ రీడిస్ట్రీబ్యూషన్ కోసం 53వ సీఐఐ నేషనల్ కైజెన్ కాంపిటీషన్ 2025లో ప్లాటినం అవార్డును కూడా సొంతం చేసుకుంది.