చెల్లి పెళ్లి.. భావోద్వేగంతో కంటతడి పెట్టిన స్టార్ క్రికెటర్

చెల్లి పెళ్లి.. భావోద్వేగంతో కంటతడి పెట్టిన స్టార్ క్రికెటర్

తోబుట్టువులు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంటే ఎంతో బాధ పడుతుంటాం. వారితో మన జ్ఞాపకాలు తలచుకొని ఎమోషనల్ అవుతుంటాం. తాజాగా శ్రీలంక ఆల్‌రౌండర్ వహిందు హసరంగకు అలాంటి సందర్భమే ఎదురైంది. 

చిన్ననాటి నుంచి తన వెంటే బుడిబుడి అడుగులు వేస్తూ పెరిగిన చెల్లి.. పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్తుంటే హసరంగా దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. చెల్లితో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియోలో హసరంగా తాను కంటతడి పెడుతూనే చెల్లిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ కష్టమొచ్చినా తానున్నానంటూ అభయమిస్తున్నాడు.

కాగా, గాయం కారణంగా హసరంగా ఆసియా కప్ 2023కు దూరం కానున్నాడు.