వారంలో 107 మంది పోలీసుల బదిలీ

వారంలో 107 మంది పోలీసుల బదిలీ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో పోలీసుల బదిలీల పర్వం కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాపంగా ఈ వారం రోజుల వ్యవధిలోనే 107 మంది పోలీసులను ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేసి పోస్టింగ్‌‌లు ఇచ్చారు. 3‌‌‌‌0 మంది అడిషనల్ ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇప్పటికే 77 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్‌‌‌‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పోస్టింగ్స్‌‌ కోసం ఎదురు చూస్తున్న నాన్‌‌ కేడర్ ఏఎస్పీలకు సహా పలువురు అడిషనల్‌‌ ఎస్పీలను వివిధ విభాగాలకు కేటాయించారు. ఈ క్రమంలోనే వచ్చే నెల మొదటి వారంలో ఐపీఎస్‌‌ల బదిలీ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.