ఆ జైల్లో ఖైదీలే గార్డ్స్...నేరస్థులే ఉద్యోగులు.. ప్రపంచంలో వింత జైలు .. ఎక్కడంటే

ఆ జైల్లో ఖైదీలే గార్డ్స్...నేరస్థులే ఉద్యోగులు.. ప్రపంచంలో వింత జైలు .. ఎక్కడంటే

జైలు పేరు వినగానే నల్లటి ఇనుప కడ్డీలు, చీకటి, చెడు ఆహారం వంటి చిత్రాలు ప్రజల మనసులో మెదులుతాయి. కానీ ప్రతి నేరస్థుడు వెళ్లాలనుకునే ప్రపంచంలో కొన్ని జైళ్లు ఉన్నాయి. ఇవి ఫైవ్ స్టార్ హోటల్స్‌కి తక్కువేమి కాదు.  ప్రపంచంలో వింత జైలు ఒకటి ఉంది.  ఈ జైల్లో ఖైదీలే ఉద్యోగస్తులట.  ఆ జైలులో ఖైదీలను కాపలా కాయడానికి గార్డ్స్ ఉండరు. ఖైదీల కౌన్సిల్ ఉంటుంది. వారు శిక్షలు వేస్తారు. అమలు చేస్తారు. ఖైదీలకు కఠిన శిక్షలు ఉంటాయి. ఆ వింత జైలు ఎక్కడంటే?

 బొలీవియాలో అతి పెద్ద జైలు.. అక్కడ గార్డ్లు ఉండరట. ఖైదీలకు కొన్ని సౌకర్యాలతో పాటు కొన్ని కఠిన నియమాలు కూడా ఉన్నాయి.  బొలీవియాలోని శాన్ పెడ్రో జైలులో దాదాపు 3 వేల మంది ఖైదీలు ఉంటారట. ఈ జైలులో ఉండే నియమాలవల్ల చాలా ఫేమస్ అయ్యింది. ఇతర జైళ్లతో పోలిస్తే ఇక్కడ ఖైదీలకు సౌకర్యాలు ఉండవు. ఉద్యోగాలు ఉంటాయి. ఏ వసతి కావాలన్నా వారు కొనుక్కోవాలి.. లేదా అద్దెకు తీసుకోవాలి. కావాలంటే వారి కుటుంబంతో కూడా ఉండవచ్చునట. వింతగా ఉంది కదా. ఈ జైలు నేరస్తులతో నిర్వహించబడుతోంది. జైలు లోపల కూడా గార్డ్స్ ఎవరూ కాపలా ఉండవు. జైలులో ఖైదీల కౌన్సిల్ కూడా ఉందట. నియమాలు వారే రూపొందించుకుని శిక్షలను వారే నిర్ణయిస్తారట. జైలులో ఉండే స్విమ్మింగ్ పూల్‌ను ఉరిశిక్షల కోసం వినియోగిస్తారట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేరస్తుడికి ఉరి వేస్తున్నప్పుడు తోటి ఖైదీలు సంగీతం ప్లే చేస్తారట.  

శాన్ పెడ్రో జైలులో ఉండటానికి ఖైదీల కుటుంబ సభ్యులుకూడా ఇష్టపడతారట. ఎందుకంటే వారు లోపల సురక్షితంగా ఉంటారని నమ్ముతారట. ఖైదీలు తమ సెల్‌ను కొనుక్కోవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చును. ఖైదీకి గది దొరకకపోతే చలి వల్ల చనిపోయినా ఆశ్చర్యం లేదట. రేపిస్టులు, పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరస్తులకు జైలులో కఠిన శిక్షలు ఉంటాయట. వారికి అత్యంత సాధారణ శిక్షలతో పాటు కొరడాలతో కొడతారట. విద్యుత్ షాక్ లు ఇవ్వడం, కత్తితో కూడా పొడిచి చంపుతారట.రస్టీ యంగ్ అనే రైటర్ ఒకసారి శాన్ పెడ్రో జైలుకు లంచం ఇచ్చి 4 నెలలు అక్కడే ఉండి ‘మార్చింగ్ పౌడర్’ అనే పుస్తకాన్ని రాసాడట. శాన్ పెడ్రో పైకి బయటకు ఇతర జైళ్లలా కనిపించినా.. పూర్తి భిన్నంగా ఉంటుంది. రెస్టారెంట్లు, చర్చిలు, స్కూళ్లు, చిన్న వ్యాపారాలు కూడా లోపల ఉంటాయట. ఇలాంటి విడ్డురాలు ఉండబట్టే ఈ జైలు గురించి వింతగా చెప్పుకుంటారు.