స్కూల్ నుంచి స్కూటీపై ఇంటికెళ్తున్న తల్లీ కూతుళ్లను ఢీకొన్న లారీ

V6 Velugu Posted on Sep 14, 2021

  • తీవ్ర గాయాలతో తల్లీ కూతుళ్లిద్దరు దుర్మరణం
  • గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ప్రమాదం

గుంటూరు: స్కూటీపై వెళుతున్న తల్లీకూతుళ్ల మీదకు లారీ వేగంగా దూసుకెళ్లింది. లారీ టైర్ల కింద పడ్డ స్కూటి నుజ్జు నుజ్జు కాగా.. తల్లీ కూతుళ్లిద్దరూ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. మంగళవారం జరిగిన ఘటన విషాదం సృష్టించింది. ఇటీవలే స్కూళ్లు ప్రారంభం కావడంతో తెనాలి పట్టణానికి చెందిన షేక్ హసీనా సుల్తానా (34) సాయంత్రం స్కూలు వదిలిన తర్వాత తన కుమార్తె షేక్ అఫ్సా (10)ను తీసుకుని స్కూటీపై ఇంటికి బయలుదేరింది. స్కూటీ సరిగ్గా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు వద్దకు రాగానే లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. 
స్కూటీ లారీ టైర్ల కింద పడి నుజ్జు నుజ్జు కాగా.. తల్లీ కూతుళ్లు తీవ్రంగా గాయపడడంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తం అయింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీని వదిలి పరారయ్యాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 

Tagged VIjayawada, Amaravati, Guntur District, ap today, tenali, bejawada, thenali, tenali market yard, lorry collied scooty, mother and daughter died on spot, shaik haseena sulthana(34), shaik afsa(10)

Latest Videos

Subscribe Now

More News