
రాష్ట్రంలోని 17లోక్‌సభ స్థానా లకు వచ్చిన నామినేషన్లలో స్క్రూటినీ అనంతరం 503 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. గురువా రం ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశముంది. మంగళవారం మొత్తం 646 నామినేషన్లు పరిశీలించిన17 నియోజకవర్గా ల రిటర్నింగ్ అధికారులు స్క్రూటినీలో 143 నామినేషన్లను తిరస్కరించారు. వీటిల్లో అత్యధికంగా మల్కాజ్ గిరిలో 27, సికింద్రాబాద్ లో 21, నిజామాబాద్ లో 14, మహబూబ్ నగర్ , భువనగిరిలో11 చొప్పున ఉన్నాయి. స్క్రూట్నీ అనంతరం 503 నామినేషన్లు సక్రమమైనవని ఆర్వోలు తేల్చారు. వీటిల్లో అత్యధికంగా నిజామాబాద్ స్థానానికి 189, నల్గొం డ 31, సికింద్రాబాద్ 30, ఖమ్మం 29, చేవెళ్ల 24 ఉన్నాయి.