కంటోన్మెంట్​లో లాస్య నందితదే గెలుపు

కంటోన్మెంట్​లో లాస్య నందితదే గెలుపు

కంటోన్మెంట్, వెలుగు : క్రిస్టియన్ మైనార్టీలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తెలిపారు. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం కంటోన్మెంట్ లోని కేజేఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన క్రిస్టియన్ల ఆత్మీయ సమ్మేళనంలో స్టీఫెన్ సన్ తో పాటు, లాస్య నందిత, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, బోర్డు మాజీ మెంబర్ జక్కుల మహేశ్వర్ రెడ్డి, పాండు యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాస్య నందిత మాట్లాడుతూ..

క్రిస్టియన్లు తనకు మద్దతు తెలపడాన్ని మర్చిపోలేనన్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పాస్టర్లు జులియన్, మనోహర్, అరుణ్ విక్టర్, మేరీ సతీశ్ పాల్గొన్నారు. ఇయ్యాల మస్తాన్ హోటల్ సెంటర్, పికెట్ చౌరస్తాలో జరగనున్న మంత్రి కేటీఆర్ రోడ్ షో, 25న పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను సక్సెస్ చేయాలని కార్యకర్తలు, అభిమానులకు లాస్య నందిత పిలుపునిచ్చారు.