
హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంట్ను సీఎం కేసీఆర్ క్యాష్ చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. కేసీఆర్12 వందల మందిని పొట్టన పెట్టుకున్నారని.. ఎంతో మంది ఆత్మ బలిదానాలతో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు.
కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు పాలన కొనసాగిస్తున్నారని రాములు నాయక్ దుయ్యబట్టారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే.. జనాల కిడ్నీలను అమ్మేస్తారని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాలకు ఉద్యోగాలిచ్చి అందరికీ న్యాయం చేశామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు ఓట్లేసేందుకు జనం సిద్దంగా ఉన్నారని, ఎస్టీ, ఎస్టీల సీట్లపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించాలని రాములు నాయక్ కోరారు.