రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల తేదీ మార్పు

రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల తేదీ మార్పు

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలో లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ తేదీని ఈసీ మార్చింది. జూన్ 4వ తేదీకి బదులు జూన్ 2న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. జూన్ 2న రెండు రాష్ట్రాల అసెంబ్లీ గడువు ముగియనుంది. గడువుకంటే రెండ్రోజులు కౌంటింగ్ డిలే కానుండటంతో ఈసీ నిర్ణయం తీసుకుంది. గడువులోపే ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని ఈసీ నిర్ణయించింది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికలు నిర్వహించనుంది. జూన్ 1న చివరి విడత పార్లమెంట్ ఎన్నికల తర్వాత..జూన్ 2న రెండు రాష్ట్రాల కౌంటింగ్ జరగనుంది.

​​​​​​​దేశంలో సార్వత్రిక ఎన్నికలతోనే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగించిన విషయం తెలిసిందే.. ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిషా, రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎలక్షన్స్ జరుగనున్నాయి. జూన్ 4 న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు. సార్వత్రిక ఎన్నికల తోపాటే వీటిని కూడా నిర్వహించ నున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటు హకకు వినియోగించుకునేందుకు 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు తెలిపారు.