అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్​కు రిజిస్ట్రేషన్లు షురూ

అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్​కు రిజిస్ట్రేషన్లు షురూ

హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి (ఏవోవిఎన్) స్కీమ్ కు 2024–25 అకడమిక్ ఇయర్ కు రిజిస్ట్రేషన్లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. అర్హులైన స్టూడెంట్స్ వచ్చే నెల13 వరకు ఈ పాస్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎస్సీ డెవలప్ మెంట్ కమిషనర్ టీకే. శ్రీదేవి, అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ప్రతి ఏటా రెండు సార్లు రిజిస్ట్రేషన్లను జనవరి, ఆగస్టులో ఓపెన్ చేస్తోంది. ఆర్థిక సహాయంగా రూ.20 లక్షలను అందజేస్తుంది.