కరువుకు కేరాఫ్.. నీళ్లకోసం లాతూర్ వాసుల గోస

కరువుకు కేరాఫ్.. నీళ్లకోసం లాతూర్ వాసుల గోస

ఎండాకాలం కష్టాలకు ఆ ప్రాంతం కేరాఫ్. ఏళ్లు, దశాబ్దాలు గడుస్తున్నా ఎండాకాలంలో వారి జీవన పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. నీళ్లను రైళ్లలో పంపించిన హిస్టరీ ఆ ప్రాంతానిది. అదే మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా. అక్కడి స్థానికులు… తాగేందుకు నీళ్లు కొంటారు. వాడుకోవడానికి నీళ్లకోసం కిలోమీటర్ల దూరం ప్రయాణాలు చేస్తారు. ప్రభుత్వం సప్లై చేసే నీళ్ల ట్యాంకర్ వచ్చినరోజు వారికి పండుగ. నీళ్ల ట్యాంకర్ వస్తుందంటే… ప్రతి ఊళ్లో ఇదే పరిస్థితి.

ఎండాకాలంలో ఈసారి కూడా కష్టాలు పడుతున్నామంటున్నారు స్థానికులు. 15 రోజులకు ఒకసారి మున్సిపాలిటీ అధికారులు వాటర్ ట్యాంకర్ పంపిస్తున్నారని.. అవి ఎటూ చాలడం లేదని గ్రామాల్లోని జనం చెబుతున్నారు. ఒక్కో కుటుంబానికి 250 లీటర్ల నీళ్లు ఇస్తారని.. 15 రోజులు వాటినే సరిపెట్టుకోవడం ఎలా అని ఆవేదనగా చెబుతున్నారు జనం.

‘పల్లెటూళ్లలో ఉండటమే మేం చేసిన పాపమా… ప్రభుత్వాలు తల్చుకుంటే మా నీళ్ల కష్టాలు పరిష్కారం కావా?…  ఇంకెన్ని దశాబ్దాలు ఇలా ఇబ్బందిపడాలి… ‘ అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఈసారి వర్షాలు పడలేదని… కరువుతో పంటలు పండలేదని.. పిల్లలకు ఉద్యోగాలు లేవని అంటున్నారు.